by సూర్య | Thu, Apr 11, 2024, 09:36 PM
జగన్ మాఫియాను ఏపీ నుంచి తన్ని తరిమేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం నాడు అంబాజీపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డొక్కా సీతమ్మ పుట్టిన నేల ఇదని చెప్పారు. ఈ సందర్భంగా పూలే జయంతి, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ సీమగా ఉన్న కోనసీమను జగన్ కలహాల, కొట్లాట సీమగా చేశారని మండిపడ్డారు. రాజకీయ దురందురుడు చంద్రబాబు అని కొనియాడారు. కోనసీమలో క్రాప్ హాలిడే రాకుండా చూసుకుంటామని మాటిచ్చారు. కోనసీమకు ఇచ్చిన హామీలను జగన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 2022 జూలైలో జగన్ ఇక్కడ పర్యటించిన సమయంలో రూ. 30 కోట్లు హామీలిచ్చి ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. కొనసీమలో పెద్ద కొడుకుగా ఉండే కొబ్బరి చెట్టు దిగుమతి ఇప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొబ్బరి పంటను కాపాడుతామని హామీ ఇచ్చారు. గంగా భవానీ కొబ్బరి బొండాలు కోనసీమ రైతులకు అందిస్తామని మాటిచ్చారు. అంబేద్కర్ విదేశీ విద్యను పునరుద్ధరిస్తామన్నారు. తన అన్న చిరంజీవి జనసేన కోసం ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారని గుర్తుచేశారు. చిరంజీవి తనకు స్కిల్ డైవలప్మెంట్‌లో శిక్షణ ఇవ్వటం వల్ల కోట్లాది ప్రజల ముందు నిలబడి మాట్లాడుతున్నానని అన్నారు. చంద్రబాబు తనకు పెద్దన్నలాగా వ్యవహారించి స్కిల్ డైవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని కోరారు. తమ సొంత డబ్బులు కౌలు రైతులకు ఇచ్చామని గుర్తుచేశారు. కోనసీమలో రైలువెళ్లేలా కృషి చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన - తెలుగుదేశం - బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. జనసేన ఓట్లు టీడీపీ, బీజేపీ అభ్యర్థులకే వేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.
Latest News