తిరుపతిలో క్రికెట్ ఫ్యాన్ మృతి,,,,గుండెపోటుతో కుప్పకూలిన ఐటీ ఉద్యోగి

by సూర్య | Tue, Nov 21, 2023, 09:09 PM

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమితో కోట్లాదిమంది అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. గ్రౌండ్‌లో ఉన్న ఫ్యాన్స్ ‌తో పాటుగా టీవీలకు అతుక్కుపోయిన అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. అయితే తిరుపతి జిల్లాలో మాత్రం ఈ పరాజయాన్ని చూసి ఓ యువకుడి గుండె మాత్రం తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ బీటెక్‌ పూర్తి చేసి కంప్యూటర్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతడు స్నేహితులతో కలిసి మ్యాచ్ చూస్తున్నాడు. భారత్ బ్యాటింగ్ సమయంలో తీవ్ర నిరాశ చెందాడు. బౌలర్ మ్యాచ్ గెలిపిస్తారని ఆశపడ్డాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్ చేజారుతుండటంతో జ్యోతి కుమార్ తీవ్ర ఆందోళన చెందాడు. ఇండియా ఓటమి తర్వాత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. త్వరలో వివాహం చేయాలనుకుంటుండగా కుమారుడి హఠాన్మరణంతో తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Latest News

 
మొన్న వైసీపీకి రాజీనామా.. ఇవాళ లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన నేతలు Tue, Nov 28, 2023, 06:52 PM
దుప్పిని కాపాడిన కాపాడిన స్థానికులు Tue, Nov 28, 2023, 06:46 PM
బంగాళాఖాతంలో అల్పపీడనం,,,ఏపీకి వాతావరణశాఖ వర్ష సూచన Tue, Nov 28, 2023, 06:41 PM
గోపాలపురం: ఆనందంగా స్నేహితులిద్దరూ సెల్ఫీ దిగారు.. సరిగ్గా 13 నిమిషాల తర్వాత లారీ ఢీకొట్టడంతో చనిపోయిన ఇద్దరు స్నేహితులు Tue, Nov 28, 2023, 06:36 PM
నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు Tue, Nov 28, 2023, 06:26 PM