చంద్రబాబుకు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్,,,,సుప్రీం కోర్టులో తీర్పును సవాల్ చేయనున్నసీఐడీ

by సూర్య | Tue, Nov 21, 2023, 09:02 PM

ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏపీ హైకోర్టు బెయిల్‌ తీర్పును సీఐడీ సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని భావిస్తోంది. చంద్రబాబుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ కొట్టివేయాలని కోరనున్నారు. ఈ మేరకు మంగళవారం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసే అవకావం ఉందంటున్నారు. ఈ కేసులో ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని సీఐడీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై సీఐడీ లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట.


ప్రధానంగా బెయిల్ తీర్పులో కేసు మెరిట్, ఆధారాలు, దర్యాప్తులో లోపాలు గురించి బెయిల్‌ పిటిషన్‌ సమయంలోనే వ్యాఖ్యానించడంపై సుప్రీం కోర్టులో ప్రస్తావించాలని భావిస్తోందట. కేసు దర్యాప్తు సందర్భంగా సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకూ టీడీపీ ఇవ్వ లేదని.. విచారణ ప్రాథమిక దశలో ఉండగా బెయిల్ వంటి పరిణామాలు ఆందోళనకరంగా ఉంది అంటున్నారట. స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. టీడీపీ ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబుకు రిమాండ్‌ విధించాలని అభ్యర్థించక ముందే తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నిధులు టీడీపీ అకౌంట్‌లోకి చేరాయనేందుకు సీఐడీ దగ్గర ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. రూ.370 కోట్ల నిధులను షెల్‌ కంపెనీలకు మళ్లించి.. ఆ సొమ్మును నగదు రూపంలో చంద్రబాబు ఉపసంహరించుకున్నారనే వాదనకు బలం చేకూరేలా సీఐడీ సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచలేదని పేర్కొంది.


చంద్రబాబుకు బెయిలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న సీఐడీ వాదనను తోసిపుచ్చింది. ఈ కేసులో ఇతర నిందితులందరూ బెయిలుపై ఉన్నారని గుర్తుచేస్తూ.. చంద్రబాబుకు బెయిలు మంజూరు చేసింది. అక్టోబరు 31న మధ్యంతర బెయిలు మంజూరు సందర్భంగా ర్యాలీల నిర్వహణ, రాజకీయ సమావేశాల్లో పాల్గొనకుండా విధించిన షరతులను ఈ నెల 29 నుంచి సడలిస్తున్నట్లు పేర్కొంది. వైద్యం చేయించుకున్న వివరాలను ఈ నెల 28 లోపు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించింది. చంద్రబాబు తప్ప ఈ కేసులో నిందితులందరూ బెయిలు, ముందస్తు బెయిలుపై రిలీజ్‌ అయ్యారని హైకోర్టు గుర్తు చేసింది. 2021లో కేసు నమోదు అనంతరం 140మందికి పైగా సాక్షులను సీఐడీ ప్రశ్నించిందన్నారు. 4 వేలకు పైగా డాక్యుమెంట్లను సేకరించిందని.. దర్యాప్తు తుది దశలో ఉంది అన్నారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న పిటిషనర్‌ విదేశాలకు తప్పించుకుపోయే ప్రమాదమే లేదన్నారు. సాక్ష్యాల తారుమారు ప్రస్తావనే రాదని.. 73 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. ఈ ఏడాది అక్టోబరు 31న మంజూరు చేసిన మధ్యంతర బెయిలును పూర్తిస్థాయిలో బెయిలు ఉత్తర్వులుగా ఖరారు చేస్తున్నామన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM