ఏపీ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు,,,,మరికొన్ని దారి మళ్లింపు

by సూర్య | Tue, Nov 21, 2023, 08:36 PM

ఏపీలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేశారు. విజయవాడ డివిజన్‌లోని రైల్వే ట్రాక్‌ మరమ్మతుల కారణంగా వీటిపి రద్దు చేశారు. మరో 8 రైళ్లను విజయ వాడ – రామవరప్పాడు మధ్యలో రద్దు చేయగా.. కొన్ని రైళ్లను ఏలూరు– తాడేపల్లిగూడెం మీదుగా వెళ్లనీయకుండా రద్దు చేసి.. నిడదవోలు జంక్షన్‌, భీమవరం టౌన్‌ గుడివాడ మీదుగా విజయవాడ వెళ్లేలా దారి మళ్లించారు. రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. రైలు నంబర్ 17243 గుంటూరు–రాయగడ 20 నుంచి 26 వరకు.. 17244 రాయగడ–గుంటూరు రైలను 21 నుంచి 27 వరకు రద్దు చేశారు. 22702 విజయవాడ–విశాఖ 20, 21, 22, 24 25 తేదీల్లో.. 22701 విశాఖ–విజయవాడ 20, 21, 22, 24, 25 తేదీల్లో రద్దయ్యాయి. 17239 గుంటూరు–విశాఖ 20 నుంచి 26 వరకు.. 17240 విశాఖ–గుంటూరు 21 నుంచి 27 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.


దారి మళ్ళించిన రైళ్ల విషయానికి వస్తే..విజయవాడ–ఏలూరు–తాడేపల్లిగూడెం–నిడదవోలు మీదుగా వెళ్లే రైళ్లను విజయవాడ–గుడివాడ–భీమవరం–తణుకు–నిడదవోలు మీదుగా మళ్లించారు. ఈ నెల 25న 12756 భావనగర్‌– కాకినాడ పోర్టు.. 12509 బెంగళూరు – గౌహతి 22, 25 తేదీల్లో దారి మళ్లించారు. 11019 ఛత్రపతి టెర్మినల్‌ – భువనేశ్వర్‌ 20, 22, 24 తేదీల్లోను.. 13351 ధన్‌బాగ్‌–అల్లాఫస్‌ 20 నుంచి 26 వరకు మళ్లించారు. 18637 అట్టాయ్‌–బెంగళూరు 25 వరకు.. 12835 అట్టాయ్‌–బెంగళూరు 21, 26 తేదీల్లోను దారి మళ్లించినట్లు తెలిపారు. 12889 టాటా–బెంగళూరు 24న.. 18111 టాటా–యశ్వంత్‌పూర్‌ 23న.. 12376 జసిద్‌ – తాంబ్రం 22న మళ్లించారు.


మరోవైపు రాజమండ్రి – విశాఖ మధ్య ట్రాక్‌ పనులు కారణంగా మచిలీపట్నం – భీమవరం – విశాఖ మధ్య నడిచే లింకు ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 25 వరకు రద్దు చేశారు. విశాఖ నుంచి భీమవరం మీదుగా మచిలీపట్నం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను 26 వరకు నిలిపివేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు నరసాపురం నుంచి రాత్రి 11 గంటలకు భీమవరం వరకు నడిచే డెమో ఎక్స్‌ప్రెస్‌ యథావిధిగా నడుస్తుందని తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పుల్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.


శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. మొత్తం 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ నెల 26, డిసెంబరు 3వ తేదీల్లో సికింద్రాబాద్‌-కొల్లం.. ఈ నెల 28, డిసెంబరు 5న కొల్లం-సికింద్రాబాద్‌ రైలు పట్టాలెక్కనుంది. నర్సాపూర్‌-కొట్టాయం ఈ నెల 26, డిసెంబరు 3న.. కొట్టాయం-నర్సాపూర్‌ ఈ నెల 27, డిసెంబరు 4న నడుస్తాయి. అలాగే కాచిగూడ-కొల్లం ఈ నెల 22, 29 డిసెంబరు 6.. కొల్లం-కాచిగూడ ఈ నెల 24, డిసెంబరు 1, 8న ఉన్నాయి. కాకినాడ-కొట్టాయం ఈ నెల 23, 30.. కొట్టాయం-కాకినాడ ఈ నెల 25, డిసెంబరు 2న పట్టాలెక్కనున్నాయి. సికింద్రాబాద్‌-కొల్లం ఈ నెల 24, డిసెంబరు 1.. కొల్లం-సికింద్రాబాద్‌ ఈ నెల 25, డిసెంబరు 2 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. వీటిలో ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ఏసీ బోగీలతో పాటు స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు ఉంటాయి.

Latest News

 
స్వామి వివేకానంద ప్రేరణలు దేశానికి గర్వకారణం Sun, Jan 12, 2025, 11:01 PM
సంక్రాంతికి ఇస్తా అన్న, సంతోషం ఏదయ్యా? Sun, Jan 12, 2025, 11:00 PM
ప్రభుత్వ పథకాల అమలుకు ప్రభుత్వం మంగళం Sun, Jan 12, 2025, 10:59 PM
ప్రచారం తప్ప చేసింది ఏమైనా ఉందా...? Sun, Jan 12, 2025, 10:58 PM
తిరుమల ఆలయ పవిత్రతను కూటమి నేతలు దెబ్బతీశారు Sun, Jan 12, 2025, 10:58 PM