నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. టీడీపీకి కొడాలి నాని

by సూర్య | Tue, Nov 21, 2023, 08:30 PM

రామాయణంలో పిడకల వేటలా టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారని మండిపడ్డారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. కృష్ణాజిల్లా గుడివాడలో ముస్లిం సంచార జాతుల వారికి నిర్వహించిన బీసీ ఈ కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని పాల్గొని సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా జగన్ పరిపాలనలో సచివాలయ వ్యవస్థ ద్వారా ఇళ్ల వద్దే 99శాతం కుటుంబాల సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు నాని.


ప్రతి పేద వాడిని ఆత్మబంధువుగా చూసే జగన్ వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని కొడాలి నాని స్పష్టం చేశారు. గుడివాడ గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల త్రాగునీటి అవసరాలు.. నివాస స్థలాల కోసం టీడీపీ హయాంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వైఎస్ఆర్, జగన్ గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారని.. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడో దమ్ముంటే చెప్పాలని ఛాలెంజ్ చేశారు.


ధనికుల కార్లు బ్రేకులు వెయ్యకుండా రోడ్లపై తిరగాలనే ప్రతిపక్షాల ఆరాటమని కొడాలి నాని మండిపడ్డారు.ప్రతి పేద వాడిని ఆత్మబంధువుగా చూసే జగన్ వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, త్వరలో రోడ్ల సమస్య పరిష్కారం అవుతుందన్నారు. చంద్రబాబు మాదిరి ఒక్క విడత ఏదైనా పథకం ఆపితే రోడ్ల సమస్యను పరిష్కరించవచ్చని సీఎం జగన్‌కు తాము చెప్పామన్నారు. ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనని సీఎం జగన్ చెప్పారన్నారు.

Latest News

 
అక్రమ కేసులు పెట్టడానికే అధికారాన్ని వాడుతున్నారు Tue, Nov 28, 2023, 05:36 PM
దొంగ ఓట్లపై నేడు విచారణ Tue, Nov 28, 2023, 05:36 PM
వచ్చేనెల 4న విశాఖలో లెజెండ్స్‌ లీగ్‌ ఆట Tue, Nov 28, 2023, 05:35 PM
యువగళానికి సంఘీభావం తెలిపిన జనసేన నాయకులు Tue, Nov 28, 2023, 05:34 PM
వైసీపీ పాలనలో విద్యావ్యవస్థను నాశనం చేసారు Tue, Nov 28, 2023, 05:34 PM