వర్షాల కారణంగా ,,,,,ఏపీ సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా

by సూర్య | Tue, Nov 21, 2023, 08:26 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా ప‌డిన‌ట్లు సీఎంవో కార్యాలయం ప్ర‌క‌టించింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్‌ఈజెడ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అక్కడి నుంచే సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సింది ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు.. త్వరలోనే రీ షెడ్యూల్‌ ప్రకటించనున్నారు.


సీఎం వైఎస్ జగన్ సూళ్లూరుపేట, తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. వాకాడు మండలం రాయదరువు దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంఖుస్థాపనతో పాటుగా రూ.94 కోట్తోల పులికాట్ సరస్సు సముద్ర ముఖ ద్వారం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అంతేకాదు ఓఎన్‌జీసీ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని బాధితులకు కూడా సూళ్లూరుపేట నుంచి నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి.

Latest News

 
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు Fri, May 17, 2024, 09:17 PM
విశాఖ వందేభారత్ ఐదు గంటలు ఆలస్యం.. ఈ రైళ్లు బయల్దేరే సమయం మారింది Fri, May 17, 2024, 09:13 PM
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..ఈ రైళ్లకు అదనంగా బోగీలు ఏర్పాటు Fri, May 17, 2024, 09:09 PM
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ Fri, May 17, 2024, 09:05 PM
రాడ్ తీయించుకునేందుకని ఆస్పత్రికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు Fri, May 17, 2024, 09:01 PM