రూ. 5,298 కోట్ల విలువైన 78 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కర్ణాటక

by సూర్య | Sun, Mar 19, 2023, 10:53 PM

రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ 13,917 ఉద్యోగాలకు హామీ ఇస్తూ రూ.5,298.69 కోట్ల విలువైన మొత్తం 78 పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్‌ ఆర్‌ నిరాణి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సింగిల్‌ విండో క్లియరెన్స్‌ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌డబ్ల్యుసిసి) సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 50 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులతో కూడిన 17 ముఖ్యమైన భారీ మరియు మధ్య తరహా పారిశ్రామిక ప్రాజెక్టులను కమిటీ పరిశీలించి ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల విలువ రూ. 3,552.66 కోట్లు మరియు రాష్ట్రంలోని 6,933 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.అలాగే రూ.15 కోట్ల కంటే ఎక్కువ, రూ.50 కోట్ల లోపు పెట్టుబడులతో 59 కొత్త ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపారు. రూ.1,542.88 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల వల్ల కర్ణాటకలో 6,984 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆ ప్రకటన పేర్కొంది.

Latest News

 
పల్లె పండుగలో పాల్గొన్న పరిటాల సునీత Thu, Oct 17, 2024, 10:57 PM
న్యాయం చెయ్యండంటూ బైఠాయించిన మహిళా Thu, Oct 17, 2024, 10:57 PM
రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి Thu, Oct 17, 2024, 10:56 PM
కూన రవికుమార్‌తో నాకు ప్రాణహాని ఉంది అంటున్న మరోనేత Thu, Oct 17, 2024, 10:55 PM
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చెయ్యండి Thu, Oct 17, 2024, 10:54 PM