అలాంటి వారు దాడి చేస్తున్నా..మనదేశం మాత్రం ముందుకే: మోడీ

by సూర్య | Sun, Mar 19, 2023, 09:46 PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు గుప్పించారు. భారత దేశం ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించగలదని ప్రపంచానికి చాటి చెప్పినట్టు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్య సంస్థలపై కొందరు వ్యక్తులు చేస్తున్న దాడి అవి విజయం సాధించడం వల్లేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ కేంద్రంగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ వ్యాఖ్యలు చేయడం, దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండించడం తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంపై దాడి, ప్రమాదంలో ప్రజాస్వామ్యం అంటూ ప్రకటలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అలాంటి  వారిని ఉద్దేశిస్తూ.. ఇండియా టుడే కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విమర్శలు చేశారు.


కొందరు వ్యక్తులు మన ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని, అయినా భారత్ ముందుకే ప్రయాణం చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఏ దేశ అభివృద్ధి అయినా, విధాన రూపకల్పనలో స్తబ్దత అన్నది అదిపెద్ద అవరోధం. మన దేశంలో వెనకటి తరహా ఆలోచన విధానాలు, కొన్ని కుటుంబాల పరిమితుల కారణంగా మరింత అడ్డంకి నెలకొంది. మనం మరింత ముందుకు వెళ్లాలంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. దేశం ఎదగాలంటే కొత్తదనాన్ని స్వీకరించే సామర్థ్యం ఉండాలి’’అని ప్రధాని పేర్కొన్నారు. భారత్ సాధించినది ఏదైనా కానీ, అది మన ప్రజాస్వామ్యం శక్తి, మన సంస్థల సామర్థ్యం వల్లేనన్నారు.


Latest News

 
సీఐ ఫిర్యాదుతో ,,,,ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు Sun, May 19, 2024, 09:13 PM
ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టే ఆయన్ని పప్పు అంటున్నారు...లోకేశ్ పై పెద్దిరెడ్డి ఆగ్రహం Sun, May 19, 2024, 09:11 PM
శాంతిభద్రతలు నెలకొల్పే బాధ్యత సీఎం, క్యాబినెట్ పై ఉంది,,,మాజీ జేడీ లక్ష్మీనారాయణ Sun, May 19, 2024, 09:11 PM
ఊరవతల నగ్నంగా మహిళ మృతదేహం.. అసలేమైంది Sun, May 19, 2024, 07:44 PM
మెగా ఫ్యామిలీపై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు Sun, May 19, 2024, 07:42 PM