తన బృందంతో నాటు నాటు హూక్ స్టెప్పులు వేసిన ప్రభుదేవా

by సూర్య | Sun, Mar 19, 2023, 09:25 PM

నేడు  ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు సాంగ్ మార్మోగుతోంది.  ఇదిలావుంటే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచాన్ని ఊపేసి ఆస్కార్ అవార్డు అందుకుంది. ఈ ఘనత సాధించిన భారత తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది. నాటు నాటు స్వరకర్త ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ తో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఇండియన్ మైకేల్ జాక్సన్, దిగ్గజ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తనదైన స్టయిల్లో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. 


స్టూడియోలో వంద మందితో కూడిన తన బృందంతో ప్రభుదేవా నాటునాటు హూక్ స్టెప్పులు వేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆర్ఆర్ఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుదేవా ఆయన బృందం హుషారుగా చేసిన నాటు నాటు స్టెప్పు వీడియో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.. థ్యాంక్యూ లెజెండ్ అని ట్వీట్ చేసింది.


Latest News

 
రాబోయే మేనిఫెస్టోని తెలంగాణలో కాఫి కొడతారు Fri, Jun 02, 2023, 07:15 PM
తెలుగు ప్రజల కోసం నిరంతరం టీడీపీ శ్రమించింది: చంద్రబాబు Fri, Jun 02, 2023, 07:14 PM
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను,,,,5వ తేదీకి వాయిదా వేసిన సీబీఐ కోర్టు Fri, Jun 02, 2023, 07:14 PM
పోలవరానికి త్వరలో రూ.12 వేల కోట్ల నిధులు విడుదల: జీవీఎల్ Fri, Jun 02, 2023, 07:13 PM
ఏపీలో వైఎస్సార్ బీమా నమోదు ప్రక్రియ షురూ Fri, Jun 02, 2023, 07:13 PM