ఈక్వెడార్, పెరూలో భూకంపం,,,శిథిలాల కింద చిక్కుకున్న అనేక మంది

by సూర్య | Sun, Mar 19, 2023, 07:51 PM

ప్రపంచంలోని వివిధ దేశాలను ఇటీవల  భూకంపం వెంటాడుతోంది. భారీ భూకంపం ఈక్వెడార్‌, పెరూలను వణికించింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 14 మంది మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అధిక ప్రాణనష్టం ఈక్వెడార్‌లోనే ఉంది. శనివారం సంభవించిన భూకంపం రిక్టర్‌ స్కేలుపై 6.8 తీవ్రతగా నమోదయినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. మచలా, క్యూన్కాలో భూకంప కారణంగా చాలా భవనాలు నేలమట్టం కాగా.. భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


పెరూ సరిహద్దులకు సమీపంలోని బాలావోలో భూకంప కేంద్రం గుర్తించినట్టు అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత భయపడిపోయిన జనాలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. వాహనాల్లో ఉన్నవారు భయంతో వాటిని వదిలేసి దిగిపోయారు. ఎల్ ఓరో‌లో 11 మంది, అజుయ్ ప్రావిన్సుల్లో ఒక్కరు సహా ఇప్పటి వరకూ 12 మంది మృతిచెందినట్టు అధికారికంగా ప్రకటించారు. గుయాక్విల్, క్విటో, మనాబి, మంటా సహా ఇతర నగరాల్లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పెరూలో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు.


ఇదిలావుంటే భూకంప నష్టం గురించి అధికారిక ఛానెల్స్ ద్వారా సమాచారం ఇస్తామని, ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని ఈక్వెడార్ అధ్యక్షుడు గుల్లెర్మో లాసో విజ్ఞ‌ప్తి చేశారు. క్విటోస్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఆఫీస్ ప్రకారం.. క్యూన్కాలో ఒక ఇంటి ముందు వాహనంపై శిథిలాలు కూలి చనిపోయిన వ్యక్తి మృతదేహం ఉన్నట్టు తెలిపాయి. చారిత్రాత్మక కేంద్రంలోని పాత ఇళ్లు దెబ్బతిన్నాయని నగరంలోని జర్నలిస్టులు కూడా నివేదించారు. సమీపంలో ఎల్ ఓరో ప్రావిన్స్‌లో ఒక టవర్ కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు.


ఈక్వెడారియన్ జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మారియో రూయిజ్ మాట్లాడుతూ.. దేశంలో మనకు ఉన్నదానికి ఇది చాలా ఎక్కువ పరిమాణం.. పెరూ భూకంప అధికారులు తొలుత తీవ్రతను 7.0గా ప్రకటించారు.. కానీ గంటల తర్వాత తీవ్రతను 6.7కి తగ్గించారు. పెరూ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ హెడ్ హెర్నాండో తవేరా.. దేశంలో స్వల్ప ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింనట్టు తెలిపారు.


Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM