మోసంలోనూ నిజాయితీ ప్రదర్శించిన ప్రేమ... ఆ ఇన్సురేన్స్ తో బాధితుడికి న్యాయం

by సూర్య | Sun, Mar 19, 2023, 07:44 PM

ఇటీవల వెలుగులోకి వచ్చిన ప్రేమ విఫలం ఇన్సురెన్స్ కాన్ సెప్ట్ అందరినీ ఆకర్షించేలా ఉంది. ప్రేమ, పెళ్లి, సహజీవనం..ఇలా ఏ బంధాన్నైనా నిలుపుకునేందుకు సమయం, డబ్బు వెచ్చించక తప్పదు. మరి ఇంత కష్టపడ్డా కూడా ఆ బంధం తెగిపోతే ఆ బాధను మాటల్లో వర్ణించడం కష్టం. గుండె పగిలిన వారిని స్నేహితులో మరొకరో ఊరడించవచ్చు. కానీ.. జేబుకు పడ్డ చిల్లును మాత్రం ఎవరికి వారే పూడ్చుకోవాలి. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్‌నే ఫాలో అయ్యిందో యువ జంట. అందుకే తన గర్ల్‌ఫ్రెండ్ చేతిలో మోసపోయిన ఆ యువకుడికి ఇన్సూరెన్స్ కింద రూ.25 వేలు దక్కాయి. 


తనకు ఈ ఇన్సూరెన్స్ మొత్తం ఎలా దక్కిందీ వివరిస్తూ ఓ యువకుడు నెట్టింట్లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తాము ప్రేమలో పడ్డామని తెలియగానే ఆ యువకుడు, యువతి తమ భవిష్యత్ పరిణామాలపై మొహమాటం లేకుండా చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే హార్ట్‌బ్రేకప్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. దీని ప్రకారం.. ఆ ఇద్దరు ఓ అకౌంట్లో నెలనెల రూ.500 వందలు జమచేశారు.


ఒప్పందం ప్రకారం..  తొలుత ఎవరు పక్క చూపులు చూసి చీటింగ్ చేస్తారో వారు అకౌంట్లో అప్పటివరకూ జమ అయిన మొత్తాన్ని రెండవ వారికి ఇచ్చేయాలి. ఈ క్రమంలోనే యువకుడి గర్ల్‌ఫ్రెండ్ తొలుత వారి బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది. దీంతో.. యువకుడికి ఆ అకౌంట్లోని రూ.25 వేలు దక్కాయి.


ఈ విషయాన్ని అతడు నెట్టింట షేర్ చేయడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు చెబుతున్నారు. ‘‘సుమారు నాలుగేళ్ల పాటు మీ బంధం సాగింది. కానీ నీకు మాత్రం తక్కువ మొత్తమే అందింది’’ అని ఒకరు కామెంట్ చేశారు. తాము కూడా ఈ ఇన్సూరెన్స్‌ను ట్రై చేస్తామని మరికొందరు చెప్పుకొచ్చారు.


Latest News

 
వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు... జనంలోకి పవన్ కళ్యాణ్ Fri, Jun 02, 2023, 09:26 PM
ఏపీపై బీజేపీ అగ్రనేతల ఫోకస్....ఇక్కడ కమలం వికసించేనా Fri, Jun 02, 2023, 09:23 PM
జనంలోకి జనసేనాని.... రూట్ మ్యాప్ పై తీవ్ర చర్చ Fri, Jun 02, 2023, 09:22 PM
టీడీపీ ఒరిజినాలిటీకి, క్రియేటివిటీకి మారుపేరు.... చంద్రబాబు Fri, Jun 02, 2023, 08:59 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ Fri, Jun 02, 2023, 08:40 PM