ఇవాళ, రేపు కూడా కురిసే ఏపీలో వర్షాలు అవకాశం,,,పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

by సూర్య | Sun, Mar 19, 2023, 06:17 PM

ఏపీకి మరో రెండు రోజులపాటు వర్ష సూచన వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులు, వడగళ్లు రాష్ట్ర ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మరోరెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లా్ల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పారు. ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.


విజయ­నగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతా­రామ­రాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకి­నాడ, కోనసీమ, నెల్లూరు, తిరుపతి పశ్చిమగోదా­వరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో రేపు (సోమవారం) అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్‌ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వరకు ద్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.


ఇక రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా.. పలు చోట్ల పంట నష్టం సంభవించింది. వడగళ్ల వానతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ధాన్యం కల్లాల్లోకి నీళ్లు చేరాయి. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్లు విద్యత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులు దెబ్బతిన్నాయి. వడగళ్ల వర్షం కారణంగా పలు జిల్లాలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ స్థాయిలో వడ­గళ్ల వాన కురవడం ఇక్కడ ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. పిడు­గులు పడే అవకాశమున్న నేపథ్యంలో పొలాల్లో పనిచేసే కూలీలు, పశువుల గొర్రెల కాప­రులు చెట్లకింద ఉండకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.


Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM