ఆ రైతులను ఆదుకోండి.... పవన్ కళ్యాణ్

by సూర్య | Sun, Mar 19, 2023, 03:54 PM

తాజాగా  కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఇప్పుడు వడగండ్లతో కూడిన వర్షాలు మరింత కుంగదీస్తున్నాయని తెలిపారు. 


ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మిర్చి రైతులు... ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మామిడి, పొగాకు, మొక్కజొన్న రైతులు... ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల రైతులు... నెల్లూరు జిల్లాలో వరి రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారని వివరించారు.  రాష్ట్రంలో అరటి, మొక్కజొన్న, కర్బూజ, బొప్పాయి పంటలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి తక్షణమే ఆర్థికసాయం, పంట నష్టపరిహారాన్ని అందించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు


Latest News

 
వసతి దీవెన మొదలు పెట్టిందే వైయ‌స్ జగన్ Tue, Mar 18, 2025, 09:03 AM
ఫీజు రియింబర్స్‌మెంట్‌ పై అసత్య ప్రచారాలు చెయ్యకండి Tue, Mar 18, 2025, 08:57 AM
నేడు మేదరమెట్లలో పర్యటించనున్న జగన్ Tue, Mar 18, 2025, 08:51 AM
దయచేసి గిరిజనుల సెంటిమెంట్ దెబ్బతీయకండి Tue, Mar 18, 2025, 08:47 AM
పాఠశాల మాత్రం ఒకేటే ఉండాలా, బెల్ట్ షాపులు ఎన్నైనా ఉండవచ్చా...? Tue, Mar 18, 2025, 08:42 AM