అలా చేస్తేనే మ్యాచ్ వీక్షించే అవ‌కాశం

by సూర్య | Sun, Mar 19, 2023, 11:02 AM

విశాఖ‌లోని పీఎంపాలెంలో ఉన్న వైఎస్సార్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం క‌నీవినీ విధంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 1. 30 గంట‌ల‌కు ఇండియా వెర్స‌స్ ఆస్ట్రేలియా మ‌ధ్యా రెండో డే అండ్ నైట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్‌కు బార్‌ కోడ్‌ ప్రవేశాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికోసం ప్రవేశ ద్వారాల వద్ద వైఫైతో కూడిన స్కానర్‌లను ఏర్పాటుచేశారు. ప్రేక్షకులు టికెట్‌పై గల బార్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి లోపలకు ప్రవేశించాల్సి ఉంటుంది. తోపులాటకు తావివ్వకుండా వుండేందుకు మ్యాచ్‌ మొదలయ్యే రెండు గంటల ముందు నుంచి లోపలకు ప్రవేశించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం చుట్టూ ప్రతి గేట్‌ వద్ద పోలీసు బందోబస్తుతోపాటు బౌన్సర్లను ఏర్పాటుచేస్తున్నారు. ప్రేక్షకులు క్యూ పద్ధతి లోపలకు ప్రవేశించే చర్యలు చేపట్టనున్నారు.

Latest News

 
సీఎం జగన్ పై రాయి విసిరిన అఘంతకుడు Sat, Apr 13, 2024, 09:53 PM
దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించవద్దు Sat, Apr 13, 2024, 09:47 PM
వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి Sat, Apr 13, 2024, 09:46 PM
రాజధానిని ముక్కలు చేసిన ఘనత జగన్ కే దక్కింది Sat, Apr 13, 2024, 09:45 PM
సీఎం జగన్ కి ప్రజలలోనుండి అభివాదం చేసిన వైయస్.భారతి Sat, Apr 13, 2024, 09:45 PM