'వాహనదారులు తమ కుటుంబం గురించి ఆలోచించుకోవాలి'

by సూర్య | Sun, Mar 19, 2023, 10:34 AM

వాహనదారులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని, అతి వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపరాదని చీరాల టూ టౌన్ సిఐ సోమశేఖర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల -ఒంగోలు బైపాస్ రోడ్డులో ఆయన శనివారం "నో యాక్సిడెంట్స్ డే" డ్రైవ్ చేపట్టారు. రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించక పోవటం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ లు వాహనాలు నడపడం వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని కోరారు. ఒకవేళ మైనర్లు వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురి అయితే వాహన యజమాని కూడా ముద్దాయి అవుతాడని సోమశేఖర్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు మీ భద్రత, మీ కుటుంబ క్షేమం దృష్టిలో ఉంచుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM