బిర్యానీ ఏటీఎం వచ్చేసింది... కమ్మని బిర్యానీ ఇలా విత్‌డ్రా చేసుకోవచ్చు

by సూర్య | Sat, Mar 18, 2023, 08:56 PM

సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సాధ్యంకానిది ఏదీ  లేదు.  ఇదిలావుంటే డబ్బులు డ్రా చేసుకునే ఏటీఎంలు అందరికీ సుపరిచితమే. ఇటీవల బంగారం కాయిన్స్ విత్‌డ్రా చేసుకునే ఏటీఎంలు కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా బిర్యానీ ఇచ్చే ఏటీఎం ప్రారంభమైంది. అవును, దేశంలోనే మొట్టమొదటి ‘మ్యాన్‌లెస్ టేక్ అవే బిర్యానీ ఏటీఎం’ను చెన్నై నగరంలో ప్రారంభించారు. ఈ బిర్యానీ ఏటీఎంకు వెళ్లి స్క్రీన్‌పై కావాల్సిన బిర్యానీని ఎంచుకొని వివరాలు ఎంటర్ చేస్తే.. నిర్దేశిత బాక్స్ నుంచి బిర్యానీ బయటకు వస్తుంది. రెండే రెండు నిమిషాల్లో బిర్యానీ తీసుకొని వెళ్లిపోవచ్చు. ఈ సరికొత్త విధానం కస్టమర్లను తెగ ఆకట్టుకుంటోంది. సూపర్ ఐడియా అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


చెన్నైలోని ‘బై వీటు కళ్యాణం’ రెస్టారెంట్ ఈ బిర్యానీ ఏటీఎంను తీసుకొచ్చింది. ‘ఈ బిర్యానీ ఏటీఎంలో మెనూ ఉంటుంది. నచ్చిన ఫుడ్ ఎంచుకోవచ్చు. ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కార్డు లేదా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు’ అని నిర్వాహకులు చెబుతున్నారు..


ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన పని లేకపోవడంతో.. బిర్యానీ లవర్స్ ఇక్కడికి క్యూ కడుతున్నారు. వెళ్తూ వెళ్తూ ఏటీఎం నుంచి బిర్యానీ తీసుకెళ్లడం చాలా బాగుందని అంటున్నారు. దీనికి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇలాంటి బిర్యానీ ఏటీఎంలను నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే బీవీకే రెస్టారెంట్ ఓనర్స్ భావిస్తున్నారు.


బిర్యానీకి నానాటికీ క్రేజ్ పెరుగుతోంది. గత ఏడాది దేశంలో బిర్యానీకి క్రేజ్, డిమాండ్ ఆల్ టైమ్ హైగా ఉందని వివిధ నివేదికల్లో వెల్లడైంది. అంతేకాదు, దక్షిణ భారతదేశంలో బాగా పాపులర్ అయిన ‘హైదరాబాద్ బిర్యానీ’కి ఇప్పుడు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుండటం మరో విశేషం. 2020లో తమ యాప్‌ ప్రతి నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్‌లను అందుకుందని స్విగ్గీ వెల్లడించింది. తమ యాప్‌కి నిమిషానికి 186 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని జొమాటో తెలిపింది.


Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM