మూడు రాజధానుల జగన్ డ్రామాకు...చంద్రబాబు కారకుడు: బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి

by సూర్య | Wed, Jan 25, 2023, 09:34 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల డ్రామాకు తెరదీయడానికి చంద్రబాబునాయుడే కారణమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబునాయుడు చేతకాని అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆయన  విమర్శించారు. చంద్రబాబు స్వార్థపూరిత నిర్ణయం వల్లే ఇప్పుడు అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారని దుయ్యబట్టారు.


ఇక, దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ రూ. 800 కోట్లతో అద్భుతమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కానీ, చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనలో కనీసం శాశ్వత శాసనసభ అయినా కట్టారా అని ప్రశ్నించారు. అలాగే, సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మూడున్నర ఏళ్లలో కనీసం ఒక సాగునీటి ప్రాజెక్టునైనా కట్టారా అని నిలదీశారు.


అలాగే, దోపిడీలో తేడాలు వచ్చి వైసీపీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా పోరు-2 పేరుతో పాదయాత్ర చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఇళ్లను సందర్శించబోతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో పాదయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. ఇక, ప్రభుత్వంపై 10 వేల ప్రజా ఛార్జ్‌షీట్లను వేయనున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. లక్ష హామీలు ఇచ్చి సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని.. కానీ, నవరత్నాల పేరుతో 9 హామీలు మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు.


 

Latest News

 
ప్రధాని మోదీతో ఓపెన్ ఏఐ సీఈఓ భేటీ,,,ఆరు దేశాల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన ఆల్ట్‌మన్ Fri, Jun 09, 2023, 10:38 PM
అసలు నారా లోకేష్ ఎవరు... పేర్ని నాని Fri, Jun 09, 2023, 10:03 PM
వైసీపీ నేతలతో ముద్రగడ పద్మనాభం భేటీ,,,,రాజకీయ వర్గాల్లో ఆసక్తిికర చర్చ Fri, Jun 09, 2023, 10:02 PM
జూన్ 12న లొంగిపోవాలని మాగుంట రాఘవకు సుప్రీం కోర్టు ఆదేశం Fri, Jun 09, 2023, 10:01 PM
విధి నిర్వహణలో నిబద్దతకు వందనాలు,,,వీఆర్వో మీనాపై నారా లోకేష్ ప్రశంసలు Fri, Jun 09, 2023, 10:01 PM