సెల్పీ మోజు ఆ యువకుడి ప్రాణాలను తీసింది

by సూర్య | Wed, Jan 25, 2023, 09:28 PM

సెల్పీ కోసం నేటి యువత చేయరాని సాహసాలు చేసి ప్రాణాలను పోగొట్టుకొంటోంది. ప్రకాశం జిల్లా కందుకూరులో ఓ యువకుడు సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోయాడు. పామును మెడలో వేసుకుని సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేసిన మణికంఠా రెడ్డి అనే యువకుడు.. పాముకాటుకి గురై మృత్యవాతపడ్డాడు. కందుకూరులోని కోవూరు రోడ్డులో.. జ్యూస్ షాప్ నిర్వహించే మణికంఠా రెడ్డి షాప్ వద్దకు.. పాములు ఆడించే వ్యక్తి వచ్చాడు. దీంతో సరదాగా పాముని మెడలో వేసుకొని మణికంఠా రెడ్డి సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు.


అదే సమయంలో ఆ పాము (Snake) మెడలో నుంచి జారీ పడింది. అప్పుడు మణికంఠ ఆ పాముని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అంతే.. పాము కాటు వేసింది. వెంటనే స్థానికులు మణికంఠా రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. కానీ.. చికిత్స అందించినా ఫలితం లేదు. యువకుడు మణికంఠా రెడ్డి చనిపోయాడు. తాళ్లూరు మండలం బొద్దికూరపాడుకి చెందిన మణికంఠా రెడ్డి.. బతుకుదెరువు కోసం కందుకూరు వచ్చాడు. ఇలా మృత్యువాత పడటంతో అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.

Latest News

 
శ్రీరామనవమి వేళ అయోధ్య ఆలయానికి టీటీడీ గిఫ్ట్ Sun, Apr 14, 2024, 05:30 PM
వైఎస్ జగన్ మీద దాడి.. నిఘా విభాగం కీలక సూచనలు Sun, Apr 14, 2024, 05:27 PM
జగన్‌‌పై జరిగిన రాళ్లదాడిపై స్పందించిన షర్మిల Sun, Apr 14, 2024, 04:34 PM
నేటి రాత్రి నుంచి 2 నెలల పాటు వేటకు విరామం.. ఒడ్డుకు చేరుకున్న పడవలు Sun, Apr 14, 2024, 04:29 PM
చేపలకు రూ. 4 లక్షలు.. వాటికి ఎందుకంత ధర..? Sun, Apr 14, 2024, 04:26 PM