మనిషిలా ప్రవర్తించిన కోతి...ఆ వీడియోకు ఊహించని వ్యూస్

by సూర్య | Wed, Jan 25, 2023, 09:03 PM

సోషల్ మీడియా వచ్చాక ఏ విషయమైన ఇట్టే పది మందికి తెలిసిపోతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్  అయింది. నెట్టింట జంతువులకు సంబంధించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. కొన్ని వీడియోలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కోతులు మనకి సహజంగా కనబడుతూ ఉంటాయి. మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏదైనా పండ్ల చెట్టు ఉంటే ఎక్కి కోసుకొని తింటూ ఉంటాయి. ఒక్కొకసారి ఇళ్లల్లోకి కూడా వచ్చేస్తూ ఉంటాయి. నిజానికి కోతులు చాలా తెలివైన జంతువులు. ఈ గ్రహం మీద వుండే జంతువులన్నింటి లోకి కోతులే చాలా తెలివైనవి. ఓ తెలివైన వానరానికి సంబంధించిన వీడియోని చూసి.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కోతి అలా చేయడం చాలా విచిత్రంగా వుంది. అది మనిషేమో అనే డౌట్ తెప్పిస్తోంది.


ఈ కోతి అచ్చం మనిషి చేసినట్లుగా చేస్తోంది. మనుషులు బట్టలు ఉతికినట్లుగా ఈ వానరం కూడా ఉతుకుతోంది. ఇదే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మామూలుగా బట్టలు ఉతికినప్పుడు మనం బట్టలకి సబ్బు రాసి ఆ తర్వాత ఉతుకుతూ ఉంటాము. బ్రష్‌తో కూడా తోముతాము. ఈ కోతి కూడా సేమ్ అలాగే ఉతుకుతోంది. పైపైన కాకుండా.. బ్రష్ వాడి మరీ ఉతకడాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు.


నిజానికి ఈ వీడియో నమ్మశక్యంగా లేదు. చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జంతువులు తరచూ మనల్ని సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. మనిషి లాగా ఫోన్‌లో చూడడం, బట్టలు ఉతకడం, మనిషికి సాయం చేయడం లాంటి వాటిని మనం తరచూ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఈ వీడియోని చూస్తే కోతి బట్టలు ఉతకడం ఏమిటి అని ఆశ్చర్యపోవడం పక్కా. 'ర్జ్కిస్నా' కామెంటరీ ఈ వీడియోలో హాస్యాన్ని పెంచేసింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లోని ankit_ang_11 పేజీలో అక్టోబర్ 22న పోస్ట్ చేశారు. దీనికి ఇప్పటికే లక్షల్లో వ్యూస్ రాగా.. లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ ఇస్తున్నారు. "హహహహ" అని ఓ యూజర్ స్పందించగా.. "ఫంగస్‌ని వదిలిస్తోంది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "ఏం చేస్తోంది అది" అంటూ మరో యూజర్ ఫన్నీ ఇమోజీలు పోస్ట్ చేశారు. చాలా బాగుందని మరో యూజర్ మెచ్చుకున్నారు. ఇలా ఎంతో మందికి ఈ వీడియో తెగ నచ్చుతోంది.


Latest News

 
ఈనెల 23 నుంచి సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ Sun, May 19, 2024, 11:16 AM
ప్రజలు శాంతియుత వాతావరణానికి సహకరించాలి Sun, May 19, 2024, 11:15 AM
దసబుజ వినాయకుడికి టిడిపి శ్రేణులు పూజలు Sun, May 19, 2024, 11:05 AM
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు Sun, May 19, 2024, 10:59 AM
రైతు భరోసా కేంద్రంలో రైతులకు జీలగులు, జనములు పంపిణీ Sun, May 19, 2024, 10:03 AM