అటవీ ప్రాంతంలో ల్యాండ్ అయిన హెలికాప్టర్

by సూర్య | Wed, Jan 25, 2023, 09:00 PM

చలికాలం నేపథ్యంలో పేరుక్కుపోయిన పొగ మంచుకారణంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు శ్రీ శ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బెంగళూరు నుంచి తిరుపూర్ వెళుతుండగా సత్యమంగళం అటవీ ప్రాంతంలో చాపర్ అత్యవసరంగా దిగింది. దట్టమైన పొగమంచు కారణంగా మార్గం కనిపించకపోవడంతో చాపర్ ను పైలట్ కిందికి దించాడు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా కడంపూర్ హిల్స్ గ్రామం ఉగిన్యాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ దిగడంతో స్థానికులు అయోమయానికి గురయ్యారు.


ఈ హెలికాప్టర్ లో రవిశంకర్ తో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు. అందరూ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. వాతావరణం అనుకూలించే వరకూ రవిశంకర్ తన సహాయకులతో పాటు అక్కడే వేచి ఉన్నారు. సుమారు గంట తర్వాత పొగమంచు తొలిగిపోగానే అక్కడి నుంచి తిరిగి బయల్దేరి వెళ్లారు.


Latest News

 
విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి Fri, Apr 26, 2024, 06:14 PM
నెల్లూరులో దుర్మార్గం రౌడీయిజాలకు స్థానం లేకుండా చేస్తా Fri, Apr 26, 2024, 06:13 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకి అలవాటే Fri, Apr 26, 2024, 06:12 PM
చంద్రబాబు చరిత్రలో పేదవారి గురించి ఇప్పుడైనా ఆలోచించాడా..? Fri, Apr 26, 2024, 06:11 PM