పదహారు మంది ఖైదీలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విముక్తి

by సూర్య | Wed, Jan 25, 2023, 03:26 PM

రాష్ట్ర జైళ్లలో మగ్గుతున్న పదహారు మంది ఖైదీలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విముక్తి లభిస్తోంది. ‘ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా.. చిన్న నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్న వారి విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్షలు మినహా చిన్న నేరాలకు పాల్పడిన ఖైదీల్లో 66శాతం శిక్ష పూర్తి చేసుకున్న వారికి విముక్తి కల్పించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర హోం, జైళ్ల శాఖ అధికారులు పేర్లు పరిశీలించిన తర్వాత 19మంది అర్హులుగా తేలారు. వారిలో ముగ్గురు ఇప్పటికే విడుదల కాగా మిగిలిన 16మందికి జనవరి 26న విముక్తి లభించబోతోంది.

Latest News

 
అరకొరగా కందిపప్పు సరఫరా Sun, Dec 03, 2023, 10:37 AM
'సీఎం జగన్ సాహసి.. చంద్రబాబు ఆంధ్రా ద్రోహి' Sun, Dec 03, 2023, 10:33 AM
మెడికల్ కాలేజీలు డ్రగ్స్ అడ్డాలుగా : నారా లోకేష్ Sun, Dec 03, 2023, 09:54 AM
అక్రమాలపై ఫిర్యాదు చేశాము: సుబ్బారెడ్డి Sun, Dec 03, 2023, 08:38 AM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు Sun, Dec 03, 2023, 08:32 AM