పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి

by సూర్య | Thu, Nov 24, 2022, 11:06 AM

తిరువూరు,  వార్డుల పరిధిలోని నూతన ఓటర్ల జాబితాలను పరిశీలించాలని, తొలగించిన ఓట్లపై దృష్టి సారించాలని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ సూచించారు. టీడీపీ కార్యాలయంలో బూత్‌ కన్వీనర్లు, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. పాత, కొత్త జాబితాలను పరిశీలిస్తూ తొలగించిన ఓట్లను ఎందుకు తొలగించారో గుర్తించాలన్నారు. అర్హతగల యువతి యువకులతో నూతన ఓటు నమోదుకు సంబంధించిన ధరఖాస్తులు అందించాలని, బూత్‌స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. వెదురు వెంకటనర్సిరెడ్డి, గద్దె వెంకటేశ్వరరావు, దొడ్డా లక్ష్మణరావు, బొంతు మాధవరావు, గద్దె హరిబాబు, బుడ్డి జగన్‌, బొద్దుకోళ్ళ ప్రేమరాజు, తెలప్రోలు మోహన్‌రావు పాల్గొన్నారు.

Latest News

 
స్పీకర్ , సీఎం జగన్ ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి Mon, Mar 20, 2023, 02:08 PM
ద‌ళిత ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబుపై టీడీపీ స‌భ్యులు దాడికి పాల్ప‌డ్డారు Mon, Mar 20, 2023, 02:07 PM
దళిత శాసనసభ్యుడిని అడ్డంపెట్టి స్పీకర్‌పైనే దాడికి పురిగొల్పారు Mon, Mar 20, 2023, 02:07 PM
సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ లు Mon, Mar 20, 2023, 02:06 PM
ఎవ్వరిని వదిలి పెట్టమంటున్న నక్కా Mon, Mar 20, 2023, 02:06 PM