లిక్కర్ స్కాం సమాచారమంతా అందులోనే...అందుకే సెల్ పోయిందని డ్రామా

by సూర్య | Wed, Nov 23, 2022, 07:58 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం సమాచారమంతా ఫోన్ లోొ ఉండటంతో అది పోయిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నాటకాలు ఆడుతున్నారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సమాచారమంతా ఆ ఫోన్ లో ఉందని... అందుకే ఫోన్ పోయిందని డ్రామా చేస్తున్నారని అన్నారు. ఈడీ విచారణలో ఈ ఫోన్ ను పరిశీలిస్తే మొత్తం సమాచారం బయటపడుతుందని... అందుకే దాన్ని దాచేశారని చెప్పారు. 


అలాగే విశాఖ రుషికొండ వాటాల సమాచారం కూడా అందులో ఉందని అన్నారు. తన అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత తన ఫోన్ పోయిందని విజయసాయి అంటున్నారని దుయ్యబట్టారు. విజయసాయి ఫోన్ నిజంగా పోయిందా? లేక జగన్ లాక్కున్నారా? అని ప్రశ్నించారు. మరోవైపు, విజయసాయికి చెందిన ఐఫోన్ 12ప్రో ఫోన్ పోయిందని ఆయన వ్యక్తిగత సహాయకుడు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  


 

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM