చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే పరిష్కరించుకొండి: జెలెన్ స్కీకి మోడీ సూచన

by సూర్య | Wed, Oct 05, 2022, 11:25 PM

ప్రస్తుత సంక్షోభానికి ఎలాంటి సైనిక పరిష్కారం లేదని, చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో ఫోన్ లో హితవు పలికారు. ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. ఐక్యరాజ్యసమితి నియమావళి, అంతర్జాతీయ చట్టం, అన్ని దేశాల ప్రాదేశిక, సార్వభౌమత్వాన్ని గౌరవించడం ముఖ్యమని సూచించారు. 


అంతేకాదు, ఉక్రెయిన్ లో ఉన్న అణుకేంద్రాల భద్రత పట్ల కూడా భారత్ ఆలోచిస్తుందని, అలాంటి అణుకేంద్రాలకు ముప్పు వాటిల్లితే ప్రజలపైనా, పర్యావరణపరంగా కలిగే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని తెలిపారు. ఈ టెలిఫోన్ సంభాషణలో భాగంగా, భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

Latest News

 
వైసీపీలోకి పిఠాపురం వర్మ?.. క్లారిటీ వచ్చేసిందిగా Mon, Apr 29, 2024, 07:39 PM
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: భూ వివాదాలు లేకుండా చేస్తారా..? అసలు భూమే లేకుండా చేస్తారా Mon, Apr 29, 2024, 07:35 PM
నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి.. ఆ స్థానాల్లో టీడీపీకి తప్పని తలనొప్పి Mon, Apr 29, 2024, 07:31 PM
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి షాక్.. జనసేన గుర్తుతో కొత్త తలనొప్పి Mon, Apr 29, 2024, 07:27 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM