దసరా ర్యాలీ సందర్భంగా ఉద్దవ్..షిండే వర్గాల మధ్య బాహాబాహీ

by సూర్య | Wed, Oct 05, 2022, 11:02 PM

మహారాష్ట్ర రాజకీయాలలో ఉద్దవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దసరా సందర్భంగా ముంబైలో శివసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ రసాబాసాగా మారింది. ఈ ర్యాలీలో ఉద్ధవ్ థాక్రే వర్గం, ఏక్‭నాథ్ షిండే వర్గాలకు చెందిన వ్యక్తులు ఘర్షణకు దిగారు. వాస్తవానికి 56 ఏళ్ల తర్వాత శివసేన రెండుగా చీలి.. వేర్వేరు ర్యాలీలు నిర్వహిస్తోంది. ఉద్ధవ్ థాక్రే, షిండే వర్గాలు సెపరేట్ ర్యాలీలు నిర్వహించాయి. అయితే మహిళా ఉద్ధవ్ థాక్రే మద్దతుదారుల బృందం ర్యాలీలో పాల్గొనేందుకు నాసిక్ నుంచి ముంబైకి వెళ్తుండగా నాసిక్-ఆగ్రా హైవేపై ఇరు వర్గాలకు చెందిన వారు గొడవ పడ్డారు.


తాము ప్రయాణిస్తున్న బస్సును ఓవర్ టేక్ చేస్తున్నప్పుడు షిండే గ్రూప్ మద్దతుదారులు అభ్యంతరకరమైన సైగలు చేశారని ఉద్దవ్ మద్దతుదారులు ఆరోపించారు. అనంతరం వారిని అడ్డగించి బుద్ధి చెప్పాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఈ క్రమంలో వారి వాహనాన్ని అడ్డుకుని మరీ షిండే గ్రూప్ అనుచరులను కొట్టారు. దాంతో ఇరు వర్గాల వ్యక్తులు ఒకరినొకరు కుమ్ములాడుకున్నారు. పోలీసుల జోక్యంతో ఘర్షణ సద్ధుమణిగింది. నిజానికి దాదర్‭లోని శివాజీ పార్కులో దసరా ర్యాలీ తీసేందుకు శివసేన లోని ఉద్ధవ్, షిండే వర్గాలు పోటీ పడ్డాయి. అయితే కోర్టు జోక్యంతో ఉద్ధవ్ వర్గానికి ఆ అవకాశం దక్కింది. నిజానికి 1966 నుంచి శివసేన శివాజీ పార్కులో దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తోంది. ఇక శివాజీ పార్కు ఉద్ధవ్ వర్గానికి దక్కడంతో షిండే వర్గం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఎంఎంఆర్‭డీఏ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహించింది. ఇలా పోటాపోటీ దసరా వేడుకలు నిర్వహించడంతో ఇరు వర్గాల మద్దతుదారుల మధ్య ఘర్షణ తలెత్తింది.


 

Latest News

 
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహణ Sat, May 18, 2024, 04:51 PM
రైతులను వెంటనే ఆదుకోవాలి: ప్రసాద్ Sat, May 18, 2024, 04:45 PM
ఫోటోగ్రఫీ పై ఉచిత శిక్షణ Sat, May 18, 2024, 04:34 PM
వాడరేవు చేరిన గవర్నర్, అధికారుల స్వాగతం Sat, May 18, 2024, 04:31 PM
సౌండ్ పొల్యూషన్ పై ఉక్కు పాదం మోపిన ఎస్సై రాజేష్ Sat, May 18, 2024, 04:29 PM