కిడ్నీల్లో రాళ్ల సమస్యకు చెక్ పెట్టండిలా

by సూర్య | Tue, Oct 04, 2022, 03:42 PM

వ్యాయామం చేయకపోయినా, స్థూలకాయం ఉన్నా, మధుమేహంతో బాధ పడుతున్నవారికి కిడ్నీల్లో రాళ్లు అధికంగా వస్తాయి. నీళ్లు తక్కువగా తాగుతున్నప్పుడు, మాంసాహారం అధికంగా తిన్నపుడు, స్టిరాయిడ్‌ లను ఎక్కువ మోతాదులో తీసుకున్నపుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు రెండు రకాలుగా ఉంటాయి. కాల్షియం అక్సినేట్‌, కాల్షియం ఫాస్పేట్‌. రక్తంలోని మలినాలను వడగట్టడంలో, శరీరంలోని అమ్ల, క్షార స్థాయిని నియంత్రించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో విటమిన్‌ బి6, సి లోపం ఉన్నపుడు, విటమిన్‌ డి అధికంగా ఉన్నప్పుడు, మద్యం ఎక్కువ తాగే వారిలో కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. కిడ్నీలకు తరచుగా ఇన్‌ఫెక్షన్లు సోకినపుడు, కణితులు ఉన్నపుడు కూడా రాళ్లు వస్తాయి. ఆలస్యంగా భోజనం చేయడంతో పాటు నిద్ర సరిగా లేని వారికీ రాళ్లు ఏర్పడతాయి.
కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టండిలా..
- రోజుకు కనీసం 5 లీటర్ల నీరు తాగాలి.
- రాత్రి పూట మెంతులను నానపెట్టి ఉదయం తాగాలి.
- కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని ప్రతి రోజు తాగాలి.
- పాలకూర, టమోటాలు, పాలు ఏవైనా కలిపి తీసుకోవద్దు. విడివిడిగా తీసుకోవాలి.
- చక్కెర, ఉప్పు బాగా తగ్గించాలి. అధిక కారం, మసాలాలు బాగా తగ్గించాలి.
- ఆకు కూరలు, కూరగాయలు విడివిడిగా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఆకుకూరల్లో కాల్షియం, కొన్నింటిలో అక్సిలేట్‌, కొన్నింటిలో పొటాషియం ఉంటాయి. కలిపితే వాటి స్థాయి పెరిగి కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM