ఏదీ ఒరిజనల్...ఏదీ నకిలీది..ఇలా చెక్ చేసుకోండి

by సూర్య | Mon, Oct 03, 2022, 10:45 PM

మారుతున్న జీవన శైలీలో రోగాలు కూడా అంతే స్థాయిలో రోగాలు  మనపై దాడి చేస్తున్నాయి. వాటిని ఎదుర్కోనేందుకు మార్కెట్ లో  కూడా ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో నకిలీల బెడద ఈ మధ్య ఎక్కువై పోయాయి. థైరాయిడ్ కోసం ఎక్కువ మంది వినియోగిస్తున్న ‘థైరోనార్మ్’ అనే మెడిసిన్ (బ్రాండ్ పేరు) పేరుతో పెద్ద మొత్తంలో నకిలీ ఔషధ విక్రయాలు కొనసాగుతున్నట్టు ఇటీవలే వెలుగు చూసింది. అబాట్ కంపెనీకి చెందిన ఉత్పత్తి ఇది. కానీ, ఈ కంపెనీ ఉత్పత్తిని అదే పేరుతో నకిలీ తయారు చేసి భారీగా తెలంగాణలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దీనిపై కేసు కూడా నమోదైంది. ఈ ఉదంతంతో మనం ఫార్మసీల్లో కొనుగోలు చేస్తున్న మందులు అసలైనవేనా? లేక నకిలీవా? అనే సందేహం రాక మానదు. ఇదొక్కటే కాదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీనికి పరిష్కారం అతి త్వరలో రానుంది.


కొనుగోలు చేసే ఔషధంపై బార్ కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్ (క్యూఆర్) ఉంటుంది. దాన్ని ఫోన్ తో స్కాన్ చేస్తే చాలు ఆ ఔషధం అసలైనదో, కాదో తెలుస్తుంది. తొలి దశలో ఎక్కువగా అమ్ముడుపోయే 300 ఔషధాలకు త్వరలోనే ఇది అమలు కానుంది. రూ.100కు పైన ధర ఉండే వాటికి తొలుత అమలు చేయనున్నారు. దీన్ని ట్రాక్ అండ్ ట్రేస్ గా పిలవనున్నారు. వాస్తవానికి దశాబ్దం కిందటే ఈ ఆలోచన మొగ్గతొడిగింది. కానీ, ఫార్మా పరిశ్రమ సన్నద్ధం కాకపోవడంతో పక్కన పడిపోయింది. ఎగుమతి చేసే ఉత్పత్తులకు కూడా ఈ క్యూఆర్ కోడ్ విధానం వచ్చే ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. క్యూఆర్ కోడ్ వల్ల 3-4 శాతం అదనపు ఖర్చు అవుతుందని పరిశ్రమ అంటోంది. 

Latest News

 
నెల వ్యవధిలో రెండుసార్లు.. తనిఖీ చేసిన పోలీసులకే షాక్.. కళ్లు జిగేల్ Sat, May 04, 2024, 07:33 PM
ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీదే అధికారం.. తేల్చేసిన తెలంగాణ లీడర్ Sat, May 04, 2024, 07:25 PM
ఏపీలో మండిపోతున్న ఎండలు.. తిరుమలలో మాత్రం వడగండ్ల వాన.. ఎందుకం Sat, May 04, 2024, 07:21 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. డబ్బులు ఇవ్వొద్దు, ఉచితంగానే Sat, May 04, 2024, 07:17 PM
రైలులో ఆవుమాంసం.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసిన పీఠాధిపతి Sat, May 04, 2024, 07:14 PM