సన్నగిల్లుతున్న ఉద్యోగ అవకాశాలు...పేరు మోసిన కంపెనీలు సైతం అదే బాటలో

by సూర్య | Mon, Oct 03, 2022, 09:43 PM

ఆర్థికమాంద్యం భయాందోళనలు, ఐటీ రంగంలో మందగమనం, కాస్ట్ కటింగ్ నేపథ్యంలో కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు  సన్నగిల్లుతున్నాయి. ఫ్రెషర్స్ కు విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గజాలతో పాటు పలు కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు. ఆఫర్ లెటర్లను తిరస్కరిస్తున్నాయి. దీంతో ఫ్రెషర్లు లబోదిబోమంటున్నారు. కొన్ని నెలల కిందట ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నామని... పలు రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత తమకు ఆఫర్ లెటర్లు ఇచ్చారని, ఉద్యోగాల్లో చేరేందుకు తాము ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో... ఆఫర్ లెటర్లను రద్దు చేసినట్టు తమకు లెటర్స్ వచ్చాయని వారు అంటున్నారు. కంపెనీ మార్గదర్శకాలు, అర్హతా నిబంధనల కారణంగా ఆఫర్ లెటర్లను రద్దు చేసినట్టు చెపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మరోవైపు, ఆర్థికమాంద్యం భయాందోళనలు, ఐటీ రంగంలో మందగమనం, కాస్ట్ కటింగ్ చర్యల్లో భాగంగానే ఐటీ కంపెనీలు ఇలా చేస్తున్నాయిని తెలుస్తోంది. వడ్డీ రేట్ల పెంపు, మార్కెట్లలో లిక్విడిటీ తగ్గడం ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు సైతం హైరింగ్ ను నిలిపివేసినట్టు సమాచారం. దీంతో, రాబోయే రోజుల్లో లేఆఫ్స్ కూడా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM