ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. భారీగా నామపత్రాలు దాఖలు

by సూర్య | Thu, Apr 25, 2024, 07:06 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక ఘట్టం పూర్తయింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామపత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. (ఏప్రిల్ 25) గురువారం మధ్యాహ్నం 3 గంటలతో నామినే,న్ల దాఖలు గడువు పూర్తి అయింది. రేపు నామినేషన్లను పరిశీలన జరగనుండగా.. ఈ నెల 29 వ తేదీన నామినేషన్లు వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక మే 13 వ తేదీన ఒకే విడతలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. జూన్ 4 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.


ఇక ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు భారీ సంఖ్యలో ముందుకు వచ్చారు. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల వెల్లువ కనిపించింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు ఏకంగా 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4210 మంది నామపత్రాలు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన.. ఈ నెల 29 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయితే.. బరిలో నిలిచేది ఎవరో తేలిపోనుంది. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. మే 11 వ తేదీన సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.


కొన్ని చోట్ల చిన్న చిన్న ఘర్షణలు మినహా నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇక నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు సమర్పించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈసారి ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలు చేశారు.

Latest News

 
ప్రభుత్వంపై పోరాటం చేసిన వ్యక్తి ఏలూరి సాంబశివరావు. Wed, May 08, 2024, 04:06 PM
గోబ్బురులో రోడ్డు ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మృతి Wed, May 08, 2024, 04:03 PM
కేకే అగ్రహారంలో అంబికా వీక్షిత్ పర్యటన Wed, May 08, 2024, 03:57 PM
రాయదుర్గంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు Wed, May 08, 2024, 03:54 PM
లోక్ సభ కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించండి Wed, May 08, 2024, 03:51 PM