చలి వేంద్రాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్

byసూర్య | Mon, Mar 16, 2026, 04:07 PM

పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడ డివిజన్ దుర్గానగర్ కాలనీలో స్థానిక వాసులు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ గారు ప్రారంభించారు.వేసవి కాలంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలకు చల్లని తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ చలి వేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.ప్రజలకు దాహం తీరేలా చల్లని తాగునీరు అందించడం గొప్ప సేవ అని తెలిపారు.ఈ సందర్భంగా ఐలాపూర్ మాణిక్ యాదవ్ గారు మాట్లాడుతూ సమాజంలో సేవా భావంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమని తెలిపారు.ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన దుర్గానగర్ కాలనీ వాసులను ప్రత్యేకంగా అభినందించారు.అలాగే అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని కాలనీల అభివృద్ధి కోసం మరియు ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, స్థానిక నాయకులు, యువకులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Latest News
 

కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే Tue, Apr 14, 2026, 04:13 PM
రైల్వే ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష తేదీలు విడుదల Tue, Apr 14, 2026, 04:09 PM
అంబేద్కర్ జయంతి: సర్పంచ్ శంకర్ ముదిరాజ్ ఘన నివాళులు Tue, Apr 14, 2026, 03:16 PM
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన సేవలు స్మరణ Tue, Apr 14, 2026, 03:02 PM
డా|| బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు Tue, Apr 14, 2026, 02:46 PM