|
|
byసూర్య | Mon, Mar 16, 2026, 04:03 PM
గజ్వేల్ అంబేద్కర్ భవన్‌లో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సదస్సులో, ఉపాధి హామీ కూలీల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ పిలుపునిచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని, వి.బి. గ్రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని ఈ సదస్సులో డిమాండ్ చేశారు. సామాజిక సేవకురాలు మమ్మద్ సుల్తానా, డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుబాయ్ సంజీవ్, రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.