|
|
byసూర్య | Mon, Mar 16, 2026, 03:53 PM
సంగారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఇన్‌చార్జ్) పాండు మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులే తప్పనిసరిగా హాజరుకావాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. అధికారులు హాజరుకాకుండా వారి సహాయకులు హాజరవుతున్నారని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు.