రుద్ర హాస్పిటల్‌ను ప్రారంభించిన బీర్ల ఐలయ్య

byసూర్య | Sun, Mar 15, 2026, 02:05 PM

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రుద్ర హాస్పిటల్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించి,ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు,సదుపాయాలను పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమని తెలిపారు.గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్న చిన్న వ్యాధులకే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని,ఇప్పుడు తుర్కపల్లి పట్టణంలోనే ఆధునిక వైద్య సదుపాయాలతో హాస్పిటల్ ఏర్పాటు కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉందని,రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి పలు చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.పేద మరియు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు.


 


 


Latest News
 

మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి? Thu, Apr 16, 2026, 04:09 PM
బీజేపీ నారీ శక్తి వందన్ పాదయాత్ర: మహిళా రిజర్వేషన్లకు స్వాగతం Thu, Apr 16, 2026, 03:09 PM
బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి సాయిబాబా దర్శనం Thu, Apr 16, 2026, 03:06 PM
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Thu, Apr 16, 2026, 03:03 PM
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి అభినందన Thu, Apr 16, 2026, 02:28 PM