అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో ప్రజల సమస్యలను తెలుసుకున్న ఐలాపూర్ మాణిక్ యాదవ్

byసూర్య | Sun, Mar 15, 2026, 12:59 PM

పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలను సందర్శించిన BRS నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ గారు, అక్కడి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.కాలనీలలో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి పలు సమస్యలను స్థానిక ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓపికగా విన్న ఐలపూర్ మాణిక్ యాదవ్ గారు, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకోవడం తన బాధ్యత అని, అమీన్‌పూర్ డివిజన్ అభివృద్ధి కోసం ఎప్పుడూ ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.*


Latest News
 

కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే Tue, Apr 14, 2026, 04:13 PM
రైల్వే ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష తేదీలు విడుదల Tue, Apr 14, 2026, 04:09 PM
అంబేద్కర్ జయంతి: సర్పంచ్ శంకర్ ముదిరాజ్ ఘన నివాళులు Tue, Apr 14, 2026, 03:16 PM
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన సేవలు స్మరణ Tue, Apr 14, 2026, 03:02 PM
డా|| బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు Tue, Apr 14, 2026, 02:46 PM