పటేల్ గూడ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

byసూర్య | Sun, Mar 15, 2026, 12:56 PM

అమీన్పూర్ :బీరంగూడ డివిజన్ పరిధిలోని పటేల్ గూడ బీహెచ్ఈఎల్ మెట్రో ఎంక్లేవ్ కాలనీలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అల్లా కృపతో ప్రపంచంలో శాంతి నెలకొని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు ఇక్బాల్, శ్రీకాంత్, యునుస్, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే Tue, Apr 14, 2026, 04:13 PM
రైల్వే ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష తేదీలు విడుదల Tue, Apr 14, 2026, 04:09 PM
అంబేద్కర్ జయంతి: సర్పంచ్ శంకర్ ముదిరాజ్ ఘన నివాళులు Tue, Apr 14, 2026, 03:16 PM
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన సేవలు స్మరణ Tue, Apr 14, 2026, 03:02 PM
డా|| బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు Tue, Apr 14, 2026, 02:46 PM