|
|
byసూర్య | Sun, Mar 15, 2026, 12:52 PM
పటాన్చెరు : పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రజల సౌకర్యార్థం మినీ ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ కాలనీలో రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ధరలో ఫంక్షన్ హాళ్లు అందించాలన్న లక్ష్యంతో మినీ ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.