|
|
byసూర్య | Sun, Mar 15, 2026, 12:48 PM
చేవెళ్ల మున్సిపాలిటీ 7వ వార్డు (మల్లారెడ్డి గూడ)లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రారంభించారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ల ప్రారంభోత్సవం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు.