|
|
byసూర్య | Sun, Mar 15, 2026, 12:45 PM
బీఆర్ఎస్ హయాంలో మూసీని రూ.16 వేల కోట్లతో అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేశామని, ఒక్క ఇల్లు కూడా కూల్చకుండానే అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అయితే, ప్రస్తుత రేవంత్ సర్కారు రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇండ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా, ప్రజలతో చర్చించకుండా వేలాది ఇండ్లను కూలగొడతామంటూ ప్రజలను భయపెడుతున్నారని, ఇది భూసేకరణ చట్టాలను ఉల్లంఘించి వేలకోట్ల అవినీతికి పాల్పడటమేనని మండిపడ్డారు.