దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది: రేణుకా చౌదరి

byసూర్య | Mon, Jan 19, 2026, 07:30 PM

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. పేదల హక్కులను కాలరాసే అధికారం ప్రధానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మోదీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి తానే పోటీ చేస్తానని, తన గెలుపును ఆపే దమ్ము కేటీఆర్ కు ఉందా అంటూ సవాల్ విసిరారు.


Latest News
 

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులు, పెన్షనర్లకు 'అన్‌లిమిటెడ్' హెల్త్ పాలసీ Thu, Feb 12, 2026, 09:08 PM
అంగన్‌వాడీ సేవల్లో నయా ట్రెండ్.. పేదల చెంతకే 'మొబైల్' పౌష్టికాహారం Thu, Feb 12, 2026, 09:03 PM
‘తెలంగాణ నా రాజ్యం’.. రాజ్యాంగానికంటే అధికంగా సీఎం ధైర్యంగా వ్యాఖ్యలు Thu, Feb 12, 2026, 08:51 PM
తెలంగాణ వచ్చినా ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత Thu, Feb 12, 2026, 08:49 PM
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. ఇజ్రాయెల్ టెక్నాలజీ భయంతో మంత్రుల షాకింగ్ నిర్ణయం Thu, Feb 12, 2026, 08:49 PM