|
|
byసూర్య | Fri, Jan 16, 2026, 12:04 PM
సంక్రాంతి పండుగ ముగియడంతో సొంతూళ్ల నుంచి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి నల్గొండ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్‌ను మళ్లించినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.