|
|
byసూర్య | Sat, Dec 13, 2025, 12:10 PM
జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సక్రు నాయక్ సర్పంచ్ గా విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్, నాయకులతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సర్పంచ్ ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కవ్వాల్ గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.