బీసీలకు తప్పకుండా అండగా నిలుస్తాం

byసూర్య | Sat, Dec 13, 2025, 11:39 AM

బీసీలకు రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేస్తామని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం చూపలేవని ఆయన అన్నారు. యువత ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. బీసీ రిజర్వేషన్లను సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచారి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, టీపీసీసీ సంవిధాన్ బచావో కమిటీ ఛైర్మన్ డా.వినయ్, కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ తదితరులు ఈశ్వరాచారి కుటుంబాన్ని ఓదార్చారు.ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతేకాకుండా, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు.


Latest News
 

మెట్రోలో రద్దీ తగ్గించేందుకు 6 కోచ్‌ల రైళ్ల ప్రతిపాదన Sun, Jan 18, 2026, 09:29 AM
వరంగల్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో.. సర్కారు కొలువులకు ఉచిత శిక్షణ, వసతి కూడా ఫ్రీ Sat, Jan 17, 2026, 08:16 PM
తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు.. 6 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు Sat, Jan 17, 2026, 08:15 PM
అలా చేస్తే వదిలేదే లేదు... రీల్స్ స్టార్లకు సజ్జనార్ వార్నింగ్ Sat, Jan 17, 2026, 06:41 PM
ఆ భూములు కోల్పోయే యజమానులకు.. 400 శాతం పరిహారం Sat, Jan 17, 2026, 06:34 PM