|
|
byసూర్య | Fri, Dec 05, 2025, 08:13 PM
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను తన ఫామ్‌హౌస్‌కు ఆహ్వానించి సన్మానించారు. గ్రామాల్లో ఎన్నికల తీరుపై ఆరా తీసిన కేసీఆర్.. వచ్చేది తమ ప్రభుత్వమేనని భరోసా ఇచ్చారు. కష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడొద్దని, కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.