|
|
byసూర్య | Wed, Nov 12, 2025, 07:52 PM
TG: రాష్ట్రంలో అధిక వర్షాలు కురవవడంతో ధాన్యం తడిచిందని, తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలోనే ఒక్క సీజన్ లో 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి తెలిపారు.