కాళేశ్వరం కమిషన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది

byసూర్య | Wed, Nov 12, 2025, 07:05 PM

కాళేశ్వరం కమిషన్‌ విచారణను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మిత సబర్వాల్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జీఎం మోయినుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. అదేవిధంగా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు నలుగురు పిటిషనర్లకు మరో మూడు వారాల సమయం ఇచ్చింది. అప్పటి వరకు కేసులో అంతకు ముందు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో జనవరి రెండో వారానికి మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.


Latest News
 

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ మైనారిటీ సంక్షేమ మంత్రి అజారుద్దీన్ Fri, Dec 05, 2025, 09:36 PM
రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానని రేవంత్ రెడ్డి హామీ Fri, Dec 05, 2025, 09:30 PM
హైదరాబాద్‌లో ఈ ఏరియాలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే Fri, Dec 05, 2025, 09:01 PM
1800 ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి,,,,తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం Fri, Dec 05, 2025, 08:59 PM
కేసీఆర్ వ్యూహం.. ఏకగ్రీవ సర్పంచులకు ఫామ్‌హౌస్‌లో సన్మానం Fri, Dec 05, 2025, 08:13 PM