|
|
byసూర్య | Fri, Oct 17, 2025, 03:43 PM
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY).. పేదరిక రేఖకు దిగువన ఉన్న (BPL) మహిళలకు LPG కనెక్షన్, వంట స్టవ్, సబ్సిడీతో స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించే పథకం. ఇందులో లబ్ధిదారులు కనెక్షన్, మొదటి రీఫిల్, వంట స్టవ్ ఉచితంగా పొందుతారు. ఈ పథకానికి BPL కుటుంబ మహిళ, LPG కనెక్షన్ లేని వారు, SC/ST/MBC/AAY, అడవి/దీవి నివాసితులు అర్హులు. అలాగే, BPL ధృవీకరణ, ఫోటో ID, చిరునామా, బాంక్ వివరాలు వంటి పత్రాలతో ఉచిత LPG కనెక్షన్ పొందవచ్చు.