|
|
byసూర్య | Fri, Oct 17, 2025, 03:22 PM
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం ఈ నెల 18న తలపెట్టిన బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.