|
|
byసూర్య | Fri, Oct 17, 2025, 03:20 PM
డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా, జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలపై అవగాహన కోసం ఏఐసీసీ నియమించిన పరిశీలకుడు మహీరధన్ శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పార్టీ కార్యకలాపాల బలోపేతం, శక్తివంతమైన నాయకత్వం ఏర్పాటు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, నియోజకవర్గాల్లో పార్టీ బలం, నాయకుల సమన్వయం, యువ నాయకత్వానికి ప్రాధాన్యత వంటి అంశాలపై చర్చించారు.