|
|
byసూర్య | Fri, Oct 10, 2025, 11:30 AM
శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం మల్కంచెరువు కట్ట వద్ద శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అక్టోబర్ 9వ తేదీ గురువారం నుండి 11వ తేదీ శనివారం వరకు అంగరంగ వైభవంగా జరగనుంది. గ్రామస్తుల ఆధ్వర్యంలో వేదశాస్త్ర పండితులచే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శుక్రవారం 10న ఉదయం 6 గంటలకు పూజా కార్యక్రమాలు, శయ్యాది వాసం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ ఉంటాయి. శనివారం 11న ఉదయం 6 గంటలకు గణపతి పూజ, మండప పూజ, హోమం, విగ్రహ ప్రతిష్టాపన, అభిషేకం, హారతి, అర్చన, నివేదన, మంత్రపుష్పం, పూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ జరుగుతాయి.