|
|
byసూర్య | Fri, Oct 10, 2025, 11:14 AM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిగా స్థానికుడు నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నవీన్ యాదవ్‌కు బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బంధుత్వం ఉంది. ఈ క్రమంలో తలసాని నవీన్ యాదవ్‌కే మద్దతు ఇస్తారనే ప్రచారం జరిగింది. దీనిపై తలసాని స్పందిచారు. బంధుత్వం వేరు, పార్టీతో అనుబంధం వేరు. ఎలాంటి అనుమానాలు అవసరంలేదు. నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా. ఆ పార్టీకే నా మద్దతు ఉంటుంది' అని క్లారిటీ ఇచ్చారు.